అన్నమయ్య: రామసముద్రం మండలంలో సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు రామంజులు, కళావతి అక్కడికక్కడే మృతి చెందారు. వివరాల్లోకెళ్తే జీవనోపాధి కోసం బెంగళూరు వెళ్తుండగా, కర్ణాటకలోని రాయల్పాడు వద్ద టీటీ వాహనం ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. దీంతో మృతదేహాలను పంచనామా కోసం రాయల్పాడు ఆసుపత్రికి తరలించారు.