ఇన్‌స్టాలో తన అభిమానులతో ముచ్చటించిన సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మీ జీవితాన్ని మార్చిన కొటేషన్‌ను చెప్పండి? అని ఒక అభిమాని అడగ్గా.. ‘మనల్ని ఇబ్బందిపెట్టే ప్రతి విషయం మనకు పాఠం నేర్పుతుంది. అలాంటి వాటినుంచి కూడా ఏదో ఒకటి నేర్చుకోండి’ అని ఆమె బదులిచ్చారు. అలాగే తన తదుపరి సినిమా ‘మా ఇంటి బంగారం’ షూటింగ్ ఈ నెలలో స్టార్ట్ కానుందని చెప్పారు.