TPT: వెదురుకుప్పం(M) దేవళంపేటలో అంబేద్కర్ విగ్రహం కాలిన ఘటనపై SP తుషార్ డూడీ వివరణ ఇచ్చారు. ఈ మేరకు మొదట ఓ షాపులో మంటలు చెలరేగాయి. క్రమంగా అవి పక్కనే ఉన్న అంబేద్కర్ విగ్రహానికి అంటుకున్నాయి. దీంతో విగ్రహం పాక్షికంగా కాలిపోయింది. అయితే ఈ ఘటనను స్థానిక సర్పంచ్ గోవిందయ్య రెండు వర్గాల మధ్య ఉన్న తగాదాలతో తనకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నించాడు.