MBNR: బాలానగర్ మండలంలోని పెద్దయపల్లి గ్రామం అయ్యప్ప ఆలయం సమీపంలోని సర్వే నెంబర్ 102, 105 ప్రభుత్వ భూమిలో ఓ వెంచర్ యజమాని అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని సామాజిక కార్యకర్త కోస్గి వెంకటయ్య సోమవారం కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ భూమిలో అనుమతి లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారని, గతంలో ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని తెలిపారు.