TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు ఈసీ షెడ్యూల్ ప్రకటించింది. నవంబర్ 11న ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 14న ఫలితాలు ప్రకటిస్తామని తెలిపింది. ఈ నెల 10న నోటిఫికేషన్ రానుంది. బీహార్ ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ ఉపఎన్నికను ఈసీ వెల్లడించింది. అక్టోబర్ 21 వరకు నామినేషన్లు వేసుకోవచ్చు. ఈ క్షణం నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని ఈసీ స్పష్టం చేసింది.