కర్ణాటకలోని గోకర్ణ గుహలో రహస్యంగా ఉంటున్న రష్యన్ మహిళ, ఆమె ఇద్దరు కుమార్తెల కేసులో సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆ కుమార్తెల తండ్రిని తానేనంటూ ఇజ్రాయెల్ దేశస్థుడు గోల్డ్స్టీన్ వేసిన పిటిషన్ విచారణలో SC ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ఆమె గుహలో ఉంటే, మీరు గోవాలో ఏం చేస్తున్నారు? తండ్రిగా వారిని ఎందుకు పట్టించుకోవట్లేదు’ అని SC ప్రశ్నించింది.