BDK: టేకులపల్లి వయా పెగళ్లపాడు నుండి బేతంపూడి నుండి సుజాతనగర్‌కు వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా దెబ్బతిన్నట్లు స్థానికులు సోమవారం వెల్లడించారు. రోజూ ఉదయం నుంచే 30 నుండి 50 వరకు దొంగ ఇసుక ట్రాక్టర్లు విచ్చలవిడిగా హెవీ స్పీడ్‌లో తిరుగుతున్న కారణంగా రహదారి పరిస్థితి మరింతగా క్షీణించిందని గ్రామస్థులు ఆగ్రహ వ్యక్తం చేశారు. అధికారులు స్పందించాలని స్థానికులు పేర్కన్నారు.