KMM: ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడు పీహెచ్సీలో మంగళవారం వైద్యాధికారి డాక్టర్ ప్రశాంత్ ఆధ్వర్యంలో ‘ఆశా డే’ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన నవజాత శిశు సంరక్షణ ప్రాధాన్యాన్ని వివరించారు. బిడ్డ పుట్టిన మొదటి 28 రోజులు కీలకమని, నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాపాయం ఉంటుందని హెచ్చరించారు. తల్లిపాలు, టీకాలు, శుభ్రత ద్వారా శిశువును ఆరోగ్యంగా ఉంచవచ్చని తెలిపారు.