GDWL: జిల్లా ధరూర్ మండలంలోని జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం పూర్తిగా తగ్గింది. మంగళవారం సాయంత్రానికి ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో 28 వేల క్యూసెక్కులు వస్తోంది. విద్యుత్ ఉత్పత్తి కోసం 30,287 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. కాలువలకు, భీమా లిఫ్ట్‌కు కలిపి 2,018 క్యూసెక్కుల నీటిని, మొత్తంగా 33,102 క్యూసెక్కుల నీటిని బ్యారేజీ నుంచి విడుదల చేస్తున్నారు.