SRPT: ఆత్మకూరు(ఎస్) మండలం మక్తా కొత్తగూడెం ఏటి నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఐదు ట్రాక్టర్లను గురువారం పోలీసులు సీజ్ చేశారు. మక్తా కొత్తగూడెం ఏరు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న రామన్నగూడెం, మక్తా కొత్తగూడం, గౌస్ తండా గ్రామాలకు చెందిన ఐదు ట్రాక్టర్లను సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్ తెలిపారు.