MBNR: దేవరకద్ర మండలం జినుగురాలకు చెందిన తేప్ప పద్మమ్మ వెన్ను సంబంధిత వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆమె వైద్య చికిత్స అవసరాల నిమిత్తం సీఎం సహాయనిధి ద్వారా రూ. 2.50 లక్షలు మంజూరు చేయించారు. అందుకు సంబంధించిన ఎల్వోసి లెటర్‌ను గురువారం ఎమ్మెల్యే బాదిత కుటుంబ సభ్యులకు అందజేశారు.