కోనసీమ: సఖినేటిపల్లి మండల పోలీస్ స్టేషన్ పరిధిలోని పాత కేసుకు సంబంధించిన నిందితుడు చొప్పళ్ళ పాల్సన్ను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. అంతర్వేది కర గ్రామానికి చెందిన పాల్సన్ ఇన్నాళ్ళు తప్పించుకుని తిరుగుతున్నాడని, అతనిని 200 గ్రాముల గంజాయితో పట్టుకున్నామని ఎస్సై దుర్గా శ్రీనివాస్ తెలిపారు. ఇంటికి వచ్చాడనే సమాచారంతో పట్టుకున్నామని తెలిపారు.