WNP: చిట్యాలరోడ్డులోని డబుల్ బెడ్ రూమ్ కాలనీలో విద్యుత్ స్తంభం ప్రమాదకరంగా మారిందని కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం విద్యుత్ SE రాజశేఖర్‌కు వినతిపత్రం ఇచ్చారు. స్తంభం పక్కనే కల్వర్టు నిర్మించడంతో నీటి ప్రవాహానికి స్తంభం దిమ్మే ఒరిగి పడిపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో బలరాం వెంకటేష్, మండ్లరాజు, గోపాలకృష్ణ పాల్గొన్నారు.