ATP: బుక్కరాయసముద్రం పరిధిలోని కేవీఎస్, గిరిప్రసాద్ కాలనీల్లో ఎమ్మెల్యే బండారు శ్రావణి పర్యటించి, కాలనీవాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దాదాపు మూడు దశాబ్దాలుగా ఇంటి పట్టాలు అందలేదని ప్రజలు ఆమె దృష్టికి తీసుకురాగా, రెవెన్యూ మంత్రికి తెలియజేసి త్వరలో పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. పాఠశాల ప్రహరీ, నీటి సమస్యపై చర్యలు తీసుకుంటామన్నారు.