గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘పెద్ది’. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ రేపు ఉదయం 11:07 గంటలకు విడుదల కానుంది. ఈ విషయాన్ని మేకర్స్ ప్రకటించారు. సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, దర్శకుడు బుచ్చిబాబు కలిసి పాట గురించి చర్చిస్తున్న ఫొటోను వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘చికిరి’ అంటే ఏమిటో రేపు తెలుసుకోండి అని ఆ పోస్ట్‌లో తెలిపారు.