BHNG: జూబ్లీహిల్స్లో గడప గడప ప్రచారంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెహమత్ నగర్, బంగారు మైసమ్మ ఆలయం వద్ద ఉన్న ఆరు బూత్లల్లో నాయకులు, కార్యకర్తలతో కలసి పెద్ద ఎత్తున్న ప్రచారం నిర్వహించారు. ‘స్థానిక మన అందరి బిడ్డ నవీన్ యాదవ్ చేయి గుర్తుకు ఓటు వేసి,అభివృద్ధికి తోడుండాలని’ ఓటర్లను కలసి ఓటు అభ్యర్థించారు.