HNK: కాంగ్రెస్ జిల్లా పార్టీ కార్యాలయంలో సోమవారం పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. BRS నేతలు “బాకీ కార్డు” పేరుతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు. BRS నాయకులకు నిజమైన చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రాన్ని దోచుకుంది ఎవరో ప్రజలకు చెప్పాలని వారిని ప్రశ్నించారు.