ATP: ఆత్మకూరు రైతు గోపాల్‌రెడ్డి ఎద్దు కళ్లకు గంతలు కట్టి ముల్లుకర్ర లేకుండా తాడు సాయంతో 10 ఎకరాల్లో శనగ విత్తనం వేశారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల్లోపే పనిని పూర్తి చేశారు. ఈ విషయం గ్రామస్థులకు తెలియడంతో చూసేందుకు అక్కడకు భారీగా తరలివచ్చారు. విత్తనాలు నాటడం పూర్తైన అనంతరం రైతును, ఎద్దును ఆత్మకూరు ప్రధాన వీధుల్లో ఊరేగించారు.