KKD: గతంలో సర్పంచ్‌గా పని చేసి, ప్రస్తుతం ఎంపీపీగా ఉన్న సామర్లకోటకు చెందిన సత్తిబాబు అనే వ్యక్తి తనను మోసం చేశాడని సామర్లకోటకు చెందిన ఓ మహిళ ఆరోపించింది. ఈ మేరకు సోమవారం కాకినాడలో జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసింది. సుమారు 22 సంవత్సరాల పాటు తనతో ఉండి, ఇప్పుడు వదిలేశాడని, తనకు న్యాయం చేయాలని ఎస్పీని కోరినట్లు ఆమె తెలిపారు.