AKP: పారిశుధ్యం పరిశుభ్రతపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఆదేశించారు. సోమవారం అచ్యుతాపురం క్యాంప్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతి గ్రామంలో నెలలో రెండు రోజులు అధికారులతో కలిసి పర్యటిస్తానన్నారు. అచ్యుతాపురం జంక్షన్లో ఫ్లై ఓవర్ పనుల ప్రగతిపై తనకు నివేదిక అందజేయాలన్నారు.