HNK: కాజీపేట మండలం మడికొండ గ్రామంలో ఓ యువకుడు అదృశ్య ఘటన చోటుచేసుకుంది. CI కిషన్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కనకం రాజు ఆదివారం ఉదయం భార్య అరుణతో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. రాత్రి వరకు కుటుంబ సభ్యులు వెతికినా ఆచూకీ లభించలేదు. సోమవారం రాజు తండ్రి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.