JN: ఎన్నికల ప్రవర్తన నియమావళి పక్కాగా అమలు కావాలని జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. ఎన్నికల ఏర్పాట్లకు సంబందించి పోలీస్, రెవిన్యూ, ఎంపీడీవో మొదలగు శాఖలకు చెందిన జిల్లా, మండల స్థాయి అధికారులతో సోమవారం గూగుల్ మీటింగ్ ద్వారా సమీక్షించి వారు మాట్లాడారు. స్థానిక సంస్థల నేపథ్యంలో జిల్లాలో మాడల్ కోడ్ పక్కాగా అమలు అయ్యేలా చూడాలని పేర్కొన్నారు.