HNK: ఈనెల 7న HNK జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం(JNS)లో ఉమ్మడి వరంగల్ జిల్లాస్థాయి కబడ్డీ ఎంపిక పోటీలు నిర్వహించనున్నారు. ఈ పోటీలు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(SGFI)ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు క్రీడా పోటీల నిర్వహణ జిల్లా కార్యదర్శి శ్రీధర్ తెలిపారు. జిల్లాస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారు అండర్-19 రాష్ట్ర పోటీలకు ప్రాతినిధ్యం వహిస్తారన్నారు. 9848876765ను సంప్రదించాలన్నారు.