ప్రపంచ పారా-అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లలో భారత బృందం చారిత్రక ప్రదర్శన ఇచ్చిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ ఏడాది భారత్ 6 బంగారు పతకాలు సహా మొత్తం 22 పతకాలు గెలుచుకుంది. ఇది దేశానికి అత్యుత్తమ ప్రదర్శన అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ‘దేశ అథ్లెట్ల విజయం చాలా మందికి స్ఫూర్తినిస్తుంది. ప్రతి సభ్యుడి పట్ల నేను గర్వపడుతున్నాను’ అని ప్రధాని పేర్కొన్నారు.