WG: తాడేపల్లిగూడెం పురపాలక సంఘ కార్యాలయం వద్ద సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ప్రజలు తమ సమస్యలను ‘పురమిత్ర’ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని మున్సిపల్ కమిషనర్ యేసు బాబు సూచించారు. ప్రజా సమస్యలు లేని తాడేపల్లిగూడెంను తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. నేడు ఎటువంటి ఫిర్యాదులు అందలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంజనీర్ వెంకటరమణ పాల్గొన్నారు