KDP: సీజనల్ వ్యాధుల నియంత్రణలో భాగంగా, చెన్నూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి ఆదేశాల మేరకు సోమవారం చెన్నూరు-3 సచివాలయం పరిధిలోని లక్ష్మీ నగర్లో ఫీవర్ సర్వే మరియు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ మేరకు ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.