కృష్ణా: గుడివాడ పట్టణ పరిధిలోని అంతర్గత డ్రైనేజీల సమస్యల పరిష్కారంపై అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాలని MLA రాము సూచించారు. పట్టణ ప్రజావేదికలో మున్సిపల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. పట్టణంలో అంతర్గత డ్రైనేజీల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. రూ.10 కోట్లతో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని అధికారులు ఆయనకు వివరించారు.