మహిళల వన్డే వరల్డ్ కప్లో టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఇప్పటికే శ్రీలంక, పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్ల్లో ఘన విజయం సాధించింది. ఈ మెగాటోర్నీలో టీమిండియా ఈనెల 9న విశాఖపట్నం వేదికగా సౌతాఫ్రికాతో తలపడనుంది. ఈ నేపథ్యంలో విశాఖ చేరుకున్న భారత జట్టుకు ACA-VDCA సభ్యులు ఘన స్వాగతం పలికారు.