NRML: నేడు బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయంపై బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ హర్షం వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికలలో ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ప్రకటించగా దానిని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కేసు వేసిన విషయం తెలిసిందే. కాగా సుప్రీంకోర్టు హైకోర్టులో చూసుకోవాలని తీర్పు ఇవ్వడం బీసీల విజయమని వారు అన్నారు.