నటి సయామీ ఖేర్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఆమెను ‘ఫేస్ ఆఫ్ ఐరన్‌మ్యాన్ ఇండియా’గా ఐరన్‌మ్యాన్ ఇంటర్నేషనల్ కమిటీ ఎంపిక చేసింది. ఏడాది వ్యవధిలో రెండుసార్లు ‘ఐరన్‌మ్యాన్ 70.3’ ట్రయథ్లాన్ పూర్తి చేసినందుకుగానూ ఆమెకు ఈ గౌరవం దక్కింది. కాగా, నవంబరు 9న గోవాలో జరగనున్న ఈ ట్రయథ్లాన్‌కు ఆమె ప్రాతినిథ్యం వహించనున్నారు.