ప్రకాశం: కనిగిరి ఆర్టీసీ నందు ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న కార్మికులను తొలగించడం సరికాదని వెంటనే వారిని విధుల్లోకి తీసుకోవాలని సోమవారం లేబర్ ఆఫీసర్ రామలింగారెడ్డికి దళిత సంఘాల ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. కనీస నిబంధనలను పాటించకుండా వారిని విధుల నుంచి ఎలా తీసేస్తారని, వారిని వెంటనే వారిని విధుల్లోకి తీసుకోవాలని లేకపోతే ధర్నా చేపడతామని తెలిపారు.