SKLM: గార మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన గేదెల గౌరీష్ కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న అతని కుటుంబానికి సహాయం అందించేందుకు శ్రీకాకుళం ఏకలవ్య బృందం ముందుకొచ్చింది. సోమవారం ఈ బృంద సభ్యులు రూ.35 వేల సేకరించి ఆయన కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో గేదెల.మోహన్ రావుతో పాటు సభ్యులు పాల్గొన్నారు.