WGL: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 3వ డివిజన్లోని ఆరేపల్లెకు చెందిన రిటైర్డ్ టీచర్ కమలాపురం రాధ భాయ్ అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న MLA కేఆర్ నాగరాజు మృతురాలి నివాసానికి వెళ్లి, ఆమె భౌతిక దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.