KDP: బద్వేల్ నియోజకవర్గంలో రాత్రి నుంచి కురిసిన వర్షానికి భారీగా వరదనీరు చేరింది. రెవెన్యూ డివిజనల్ అధికారి, మున్సిపల్ కమిషనర్ నరసింహరెడ్డి సిబ్బందిని అప్రమత్తం చేసి, పలు ప్రాంతాలను పరిశీలించారు. ఈ మేరకు ఆర్టీసీ గ్యారేజ్‌లో నీటిని తొలగించేందుకు డిపో మేనేజర్‌తో సమన్వయంతో చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.