NDL: కొలిమిగుండ్ల మండలం బెలుము గుహల సమీపంలో చేస్తున్న మైనింగ్ గనులను సోమవారం జనసేన నాయకులు పరిశీలించారు. గుహల సమీపంలో మైనింగ్ బ్లాస్టింగ్ చేయడంతో గుహలు దెబ్బ తినే అవకాశం ఉందని జనసేన నాయకులు అన్నారు. గుహలకు సమీపంలో మైనింగ్ గనులు నిలుపుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు.