KNR: స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు సైదాపూర్ మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ప్రెసైడింగ్, అసిస్టెంట్ ప్రెసైడింగ్ ఆఫీసర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. 80 మంది అధికారులకు ఎన్నికల విధానాలు, పోలింగ్ కేంద్రాల నిర్వహణ, ఎన్నికల నిబంధనలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎంపీడీవో యాదగిరి, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంఈవో శ్రీనివాస్, పాల్గొన్నారు.