ADB: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జాన్సన్ నాయక్ సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సోమవారం ఇంద్రవెల్లిలో పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ అభ్యర్ధులను గెలిపించాలన్నారు.