PLD: నరసరావుపేట రావిపాడు రోడ్డులోని A9 బ్యూటీస్ స్పా పక్కనే నడుపుతున్న వ్యభిచార గృహంపై పక్కా సమాచారంతో సీఐ షేక్ ఫిరోజ్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. నిన్న జరిగిన ఈ రైడ్లో ఇద్దరు పురుషులు, ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకుని, స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్పీ కృష్ణారావు ఆదేశాల మేరకు దాడులు నిర్వహించి, వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.