VSP: పీఎం పాలెం రామాలయం దగ్గర కాలువలో పడి మృతి చెందిన వ్యక్తిని మువ్వల ప్రసాద్ (61)గా గుర్తించారు. పీఎం పాలెం హౌసింగ్ బోర్డు ఎల్ఈడిలో నివాసం ఉంటున్నారు. స్థానికంగా సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. మృతునికి భార్య, ఒక కుమార్తె ఉన్నారు. మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.