W.G: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీ ఛైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన మందలపు రవిని తాడేపల్లిగూడెం నియోజకవర్గ నేతలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు కలిసి అభినందించారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ.. రాష్ట్ర సాంకేతికాభివృద్ధికి మరిన్ని వినూత్న కార్యక్రమాలు చేపట్టి, యువతకు ప్రేరణగా నిలుస్తానని తెలిపారు.