AP: తిరుపతి ఎస్వీ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. అయితే వర్సిటీ సమీపంలో సీఎం చంద్రబాబు పర్యటన కోసం అధికారులు హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. ఆ హెలిప్యాడ్ వద్ద ఐఈడీ బాంబులు పెట్టినట్లు ఈమెయిల్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే హెలిప్యాడ్ పరిసరాల్లో బాంబు స్క్వాడ్, పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు.