TG: నగర శివారులో చేపడుతున్న రీజనల్ రింగ్ రోడ్ (RRR) ప్రాజెక్టుపై బాధితులు ఆందోళన చేపట్టారు. తమ భూములను ప్రభుత్వం తక్కువ ధరకు తీసుకోవడాన్ని నిరసిస్తూ HMDA కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. బాధితులు ఒక్కసారిగా HMDA కార్యాలయానికి చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వీరికి మద్దతుగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, పలువురు నేతలు ధర్నాకు దిగారు.