KDP: పులివెందుల-కడప ప్రధాన రహదారిలో ముసల్ రెడ్డి గారి పల్లికి వెళ్లే దారిలో పైపులైన్ కోసం తీసిన గోతిలో స్కూల్ బస్సు సోమవారం దిగబడింది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే పైపులైన్ పనులు పూర్తయిన తర్వాత గుంతలను సరిగా పూడ్చకపోవడమే ఈ ఘటనకు కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.