GDWL: రాబోయే స్థానిక ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటుందని జిల్లా మాజీ అధ్యక్షుడు ఎస్. రామచంద్రారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సోమవారం మల్దకల్ మండలంలో మండల అధ్యక్షుడు తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. గత పార్లమెంటు ఎన్నికల్లో మండలంలో బీజేపీకి 5 వేలకు పైగా మెజారిటీ వచ్చిందన్నారు.