ఇటీవల కాలంలో సిరాజ్ టీమిండియా తరఫున అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. తాజాగా వెస్టిండీస్‌తో తొలి టెస్టులో కూడా 7 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో సిరాజ్ మాట్లాడుతూ.. తాను ఇప్పటికీ ధోనీ ఇచ్చిన ఓ సలహాను పటిస్తున్నట్లు చెప్పాడు. ‘ఇతరుల మాటలను పట్టించుకోవద్దు. విమర్శలకు, పొగడ్తలకు దూరంగా ఉండాలి’ అని ధోనీ చెప్పిన మాటలు అక్షర సత్యాలు అని పేర్కొన్నాడు.