KMR: గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవాలని బిక్కనూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి దివ్య సూచించారు. సోమవారం బిక్కనూర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణులకు వైద్య పరీక్షలు చేశారు. వారికి కావలసిన మందులను అందజేశారు. అనంతరం వైద్యాధికారి మాట్లాడుతూ.. క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.