SKLM: ఆమదాలవలస ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్‌పై కళాశాల ప్రిన్సిపాల్ బీ శ్యామ్ సుందర్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ జీఎస్టీ 2.0 సంస్కరణలు వలన ప్రజలకు, రైతులకు కలిగే ప్రయోజనాలను విద్యార్థులకు తెలియజేశారు. ప్రతి ఒక్క విద్యార్థి దీనిపై అవగాహన కలిగి ఉండాలన్నారు.