ప్రకాశం జిల్లా ఒంగోలులో సివిల్ పోలీసులు, రైల్వే పోలీసులు సంయుక్తంగా ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను సోమవారం అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకెళ్తే రైళ్లల్లో నిద్రిస్తున్న వారి మెడలో నుంచి బంగారు గొలుసులను చోరీ చేస్తున్న వీరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం దొంగల వద్ద నుంచి 41 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.