DMK ఎంపీ రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలను అణిచివేయడమే BJP ప్రధాన ఉద్దేశమని ఆరోపించారు. NDA కూటమిలో ఉన్న TDP ఎంపీల్లో కలవరం ఉందని అన్నారు. వేరే దారిలేక తాము NDA కూటమిలో ఉన్నామంటున్నారని చెప్పారు. రానున్న రోజుల్లో ప్రాంతీయ పార్టీలు భాషలు, సంప్రదాయాలు కనుమరుగవుతాయన్నారు. తమిళం, తెలుగు, మలయాళం భాషలు అణచివేయబడతాయని అభిప్రాయపడ్డారు.