SKLM: ఎల్ ఎన్ పేటలో సోమవారం గ్రామ సభను నిర్వహించారు. ఈ సభకు అధ్యక్షత వహించిన సర్పంచ్ దివాకర్ నాయుడు మాట్లాడుతూ.. గ్రామ సభల ద్వారా వివిధ పనులను గుర్తించడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా గతంలో చేపట్టిన పనులు గురించి, అదే విధంగా భవిష్యత్తులో చేపట్టబోయే పనుల గురించి ప్రజలకు వివరించారు. ఈ సమావేశంలో వార్డు మెంబర్స్, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.